1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Blueprint for end of lockdown..Six committees in AP

లాక్‌డౌన్‌ ముగింపు కోసం బ్లూప్రింట్‌.. ఏపీలో ఆరు కమిటీలు

Blueprint
లాక్ డౌన్ ప్రారంభమై 50 రోజులు దాటిన నేపథ్యంలో .. సడలింపు కోసం అన్ని ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. లాక్ డౌన్ కు ముగింపు పలికేందుకు బ్లూ ప్రింట్ రూపొందోస్తున్నాయి.

ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కూడా బ్లూ ప్రింట్ రూపకల్పనకు ఆరు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

ఆయా కమిటీలు ఆయా రంగాల్లో క్రమంగా దశలవారీ లాక్‌డౌన్‌ ముగింపు తరువాత కార్యకలాపాలు కొసాగించేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే నిబంధనలు పాటించాలి? అమలు చేయాలనే అంశాలతో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌తో బ్లూప్రింట్‌లను నివేదికల రూపంలో రూపొందించి బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌కు సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఆయా రంగాలన్నింటికీ ఈనెల 17వ తేదీలోగా ముసాయిదా నివేదికలను పంపించాలని పేర్కొన్నారు. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ అన్ని రంగాలు విధిగా పాటించాలన్నారు. వీటి అమలు తీరు తెన్నులపై పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
దక్షిణ కొరియా దుర్ఘటనల్లో ఎంత పరిహారం ఇచ్చారో?: టిడిపి