సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 మే 2020 (07:48 IST)

వుహాన్‌లో ప్రజలందరికీ పరీక్షలు

చైనా నగరం వుహాన్‌లో ప్రజలందరికీ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుమారు కోటి పది లక్షల మందికి పరీక్షలు చేయాల్సి వస్తుంది.

ఈ నగరంలో కరోనా వైరస్‌ను నిర్మూలించి, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కొత్త ఇన్ఫెఫెక్షన్‌ కేసులను కనుగొనడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్‌ ధాటికి విలవిలాడుతున్న అమెరికాలో ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 80 వేలు దాటింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 2,82,500 మంది మృతి చెందగా, అమెరికాలోనే 82 వేలకు పైగా మరణించారు. ప్రపంచంలో సుమారు 42 లక్షమంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

మంగళవారం నుంచి రష్యాలో లాక్‌డౌన్‌ నిబంధనలు స్వల్పంగా తొలగించడం ప్రారంభించారు. రష్యాలో గత 24 గంటల్లో 11,656 కొత్త కేసులు నమోదయ్యాయి.

మొత్తంగా 2,21,344 మంది వైరస్‌ బారిన పడగా, 2 వేలకు పైగా మృతి చెందారు. యూరప్‌లో అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన స్పెయిన్‌, ఫ్రాన్స్‌ల్లోనూ నిబంధనలను క్రమంగా తొలగించడం ప్రారంభించారు.