బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 మే 2020 (21:12 IST)

పదో తరగతి పరీక్షలపై వదంతులు నమ్మవద్దు: పాఠశాల విద్యాశాఖ కమీషనర్

కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రస్తుతానికి వాయిదా వేసిన సంగతి విధితమే.

కొంతమంది ఈ నెల 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటూ అనధికార టైమ్ టేబులును సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వదంతులు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇలాంటి వదంతుల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వదంతులు పుట్టించినవారిపై, షేర్ చేసినవారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందవద్దని విద్యాశాఖ కమీషనర్ స్పష్టం చేశారు.