1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 మే 2020 (20:41 IST)

ఖైరతాబాద్ గణేషుడికి లాక్ డౌన్ ఎఫెక్ట్?

ఖైరతాబాద్ గణేషుడికి లాక్ డౌన్ ఎఫెక్ట్ తగిలింది. ఈసారి ఆయన విశ్వరూప దర్శనం అనుమానంగానే వుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే.

రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే గణేషుడి విగ్రహం ఉండనుందని సమాచారం.

ఈ ఏడాది ఆగస్ట్ 22న వినాయక చవితి వస్తున్న విషయం తెలిసిందే. గణేశ్ తయారీలో తొలి ఘట్టమైన కర్రపూజను మే 18న సాయంత్రం 5 గంటలకు జరపనున్నారు. అదే రోజు గణేశుడిపై ప్రకటన చేయనున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తెలిపారు. గతేడాది గణేశుడు 61 అడుగుల ఎత్తులో ఏర్పాటైన విషయం తెలిసిందే.

ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా దర్శన మిచ్చాడు. 1954 నుంచి గణేశుడు ఒక్కో అడుగు పెరుగుకుంటూ వస్తున్నాడు. కోటి రూపాయలతో రూపుదిద్దుకున్న గణేశుడి కోసం 100 మందికి పైగా కళాకారులు నాలుగు నెలలు కష్టపడి తయారు చేశారు.