శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (18:29 IST)

వైకాపా కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ : బుద్ధా వెంకన్న

buddha venkanna
వైకాపా నేతలకు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గట్టి హెచ్చరిక చేశారు. వైకాపా నేతలు ఇప్పటికైనా నోటిని అదుపులో ఉంచుకోవాలని కోరారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని ఆయన హెచ్చరించారు. 
 
ముఖ్యంగా, తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి చెత్తవాగుడు వాగితే చంపడానికైనా, చావడానికైనా తాము సిద్ధమేనని ప్రకటించారు. ఇందుకోసం వంద మందితో సూసైడ్ బ్యాచ్‌ని సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
చంద్రబాబు జోలికిగానీ, ఆయన కుటుంబం జోలికిగానీ వస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు తిడితేనో, టీడీపీ కార్యాలయాలపై దాడి చేస్తేనో పదవులు వస్తాయనుకునే భ్రమల్లో నుంచి బయటకు వాలాని ఆయన వైకాపా నేతలకు పిలుపునిచ్చారు. సీనియర్లు కాదని జోగి రమేష్‌కు మంత్రి పదవి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు.