శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (18:22 IST)

దేశంలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 2380 కేసులు.. 214 మంది మృతి

corona
కరోనా పుట్టినిల్లు చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2380 నమోదయ్యాయి.
 
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,14,479 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1231 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 97.76 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 214 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,22,062కి చేరింది.