1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Anandaiah wrote a letter to ap cm Jagan

ఏపీ సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ.. మందు తయారీకి సహకరిచండి..

Anandaiah
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కృష్ణపట్నం ఆనందయ్య లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా మందు తయారీకి సహకరించాలని కోరారు. ఒక్కో జిల్లాకి ఐదు వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ద్వారా పంపిణీ‌ చేయించాలని ఆనందయ్య లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఔషదం తయారీకి అవసరమైన సామగ్రి తదితరాలకు సహకారం అందించాలన్నారు.
 
కరోనా బాధితులకు విముక్తి కలిగిస్తున్న మందు ఎక్కువ మొత్తంలో తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సైతం పంపిస్తామని ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో కోరారు. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 
 
సోమవారం ఆనందయ్య అందించే కె మందు పంపిణీకి సైతం హైకోర్టు అనుమతి ఇచ్చింది. నేడు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, పొదలకూరు మండలాల్లో నేడు మందు పంపిణీ చేయనున్నారు. గ్రామ వలంటీర్ల సహాయంతో ఆనందయ్య మందును ఇంటింటికీ పంపిణీ చేయించనున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కిడ్నాప్.. ఎనిమిదేళ్లుగా అత్యాచారం.. ఇంజెక్షన్లు.. మందు బిల్లలు ఇచ్చి..?