ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (11:28 IST)

ఆ ఇద్దిరికీ లేఖలు రాసిన రఘురామరాజు... ఎందుకంటే...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని లేఖ కోరారు. భీమవరం ఆక్వా సంస్కృతికి రాజధాని అని రఘురామ గుర్తుచేశారు. 
 
అలాగే, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌కు కూడా రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌ జైలు నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించాలని కోరారు. 
 
రాజద్రోహం కేసు కారణంగా రామకృష్ణ రిమాండ్‌లో ఉన్నారని, మధుమేహం, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రామకృష్ణకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. జడ్జి రామకృష్ణ కుటుంబసభ్యుల ఆవేదనను అర్థం చేసుకుని, జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను లేఖలో రఘురామకృష్ణరాజు కోరారు.
 
అంతకుముందు జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ... రఘురామకు ఫోన్‌ ద్వారా ఆయన ఆరోగ్య స్థితిగతుల గురించి వివరించారు. తన తండ్రికి మెరుగైన వైద్యం కోసం గవర్నర్‌కు లేఖ రాసి సహకరించాలని కోరారు. దీంతో ఆర్ఆర్ఆర్ గవర్నరుకు లేఖ రాశారు.