శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (10:03 IST)

కాసేపట్లో మోడీ ఏరియర్ సర్వే.. యాస్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో

ప్రధాని నరంద్ర మోడీ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. తుఫాను ప్రభావిత రాష్ట్రాల్లో ఆయన ఈ సర్వే చేయనున్నారు.  తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన విమానంలో నుంచి పరిశీలిస్తారు. 
 
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను ధాటికి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అపార నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి ఆయన ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. 
 
ఈ తర్వాత యాస్ తుఫాను సమీక్ష సమావేశం ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతుంది. బెంగాల్‌లో నిర్వహించే సమీక్షా సమావేశంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొంటారు. కాగా, తుఫాను ప్రభావం అధికంగా పడిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ శుక్రవారం పర్యటించనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
 
రెండు రాష్ట్రాల్లో సమీక్ష సమావేశాలను చేపట్టనున్నారని పేర్కొంది. ఏరియల్ సర్వే సైతం చేపడతారని స్పష్టం చేసింది. ఇలావుండగా యాస్ తుఫాను తీరం దాటే సమయంలో బంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రా​లను కుదిపేసిన సంగతి తెలిసిందే. యాస్ తుఫాను కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.