ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (18:58 IST)

కిడ్నాప్.. ఎనిమిదేళ్లుగా అత్యాచారం.. ఇంజెక్షన్లు.. మందు బిల్లలు ఇచ్చి..?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామవాంఛతో కొందరు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. యువతికి కోరికలు రేకెత్తేలా ఇంజెక్షన్లు.. మందుబిల్లలు ఇస్తూ 8 సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు పోలీసులకు చిక్కారు.

వీరిలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. భర్తకు భార్యనే ప్రోత్సహించడం గమనార్హం. మైనర్‌గా ఉన్నప్పుడు కిడ్నాప్‌ చేయగా ఇప్పుడు ఆ బాలిక యువతిగా మారింది. ఎట్టకేలకు నిందితుల చెర నుంచి ఆ యువతి బయటపడింది.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తె ఇంటర్‌ చదువుతుండేది. 16 ఏళ్లు ఉన్న ఆ బాలికను ఎనిమిదేళ్ల కిందట కొందరు కిడ్నాప్‌ చేశారు. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. 
 
బాలికకు కామ కోరికలు కలిగేలా ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. ఆమెపై ఇష్టమొచ్చినప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమెను బెదిరింపులకు పాల్పడేవారు. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామని హెచ్చరించి ఆమెను నిర్బంధించారు. ఇలా 8 ఏళ్లుగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీనికి నిందితుడి భార్య కూడా సహకరించేది.
 
చివరకు వారి చెర నుంచి బయటకు వచ్చిన యువతి అంబోలి పోలీసులను సంప్రదించింది. 27 పేజీలతో ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు అనంతరం పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్‌ చేశారు.