పరుగులెత్తుతున్న పెట్రోల్ ధరలు.. ఆల్ టైమ్ రికార్డ్

petrol pump
petrol pump
సెల్వి| Last Updated: మంగళవారం, 8 జూన్ 2021 (12:35 IST)
పరుగులెత్తుతున్న పెట్రోల్ ధరలు తాజాగా పెరిగిన ధరలతో ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగాధర జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 106.08 రూపాయలుగా నమోదైంది. దేశంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటి చాలా కాలమైంది. దేశంలో పెట్రోల్ ధర మొదటిసారి 100 రూపాయల మార్క్‌ను దాటింది కూడా రాజస్థాన్‌లోనే. అయితే శ్రీగంగాధర జిల్లాలో నమోదైన పెట్రోల్ ధర కంటే అవి తక్కువే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు 100కు పైగానే కొనసాగుతున్నాయి. కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 101.3గా నమోదైంది. ఇక డీజిల్ ధర 93.35గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 95.09గా నమోదు కాగా, డీజిల్ ధర 86.01గా నమోదైంది.

వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు చూసుకుంటే హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.98.48, డీజిల్ రూ.93.08, చెన్నైలో పెట్రోల్ రూ.96.23, డీజిల్ రూ.90.38, కోల్‌కతాలో పెట్రోల్ రూ.94.76, డీజిల్ రూ.88.51, బెంగళూరులో పెట్రోల్ రూ.97.92, డీజిల్ రూ.90.81గా ఉంది.దీనిపై మరింత చదవండి :