శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (11:57 IST)

దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు.. 3.5 లక్షల మార్క్ దాటిన కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో కొన్ని రోజులుగా నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. అయితే.. మరణాలు మాత్రం కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. 
 
గత 24గంటల్లో కేసులు, మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా నిన్న కొత్తగా 1,14,460 కేసులు నమోదు కాగా.. ఈ వైరస్ కారణంగా 2,677 మంది మరణించారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,88,09,339 కి పెరగగా.. మరణాల సంఖ్య 3,46,759 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
 
ఇదిలాఉంటే.. నిన్న ఈ మహమ్మారి నుంచి 1,89,232 బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,69,84,781 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,77,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి.