శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (13:17 IST)

12 మంది మహిళలపై అత్యాచారం చేసిన మెకానికల్ ఇంజనీర్.. ఎక్కడ?

ముంబైకు చెందిన ఓ కేటుగాడు ఏకంగా 12 మందిపై అత్యాచారం జరిపాడు. 33 యేళ్ళ కామాంధుడు.. మెకానికల్ ఇంజనీర్ కావడం గమనార్హం. వివాహ పరిచయ వేదికల్లో తప్పుడు వివరాలు పెట్టి.. యువతులను వలలో వేసుకుని, వారిని లైంగికంగా వాడుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని మలాడ్‌అయిన మహేశ్ అలియాస్ కరణ్ గుప్తా ఈ మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాగా విద్యావంతులైన మహిళలే లక్ష్యంగా వివాహ పరిచయ వేదికల్లో తప్పుడు ఖాతాలు సృష్టించాడని, ప్రొఫైల్ నచ్చిన మహిళకు ఫోన్ చేసి పబ్బులు లేదా రెస్టారెంట్లు, మాల్స్ వద్ద కలిసేవాడని చెప్పారు. 
 
తన వద్దకు వచ్చిన మహిళలకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడన్నారు. అలా ఇప్పటిదాకా 12 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. అయితే, ఇంకా ఎక్కువ మందే అతడికి బాధితులై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
 
ప్రతి నేరానికీ కొత్త ఫోన్ నంబర్ వాడాడని, అవి కూడా తన పేరు మీద తీసుకున్నవి కాదని చెప్పారు. కొంత కాలం క్రితం హ్యాకర్‌గా పనిచేశాడని, దీంతో అతడికి కంప్యూటర్లపై మంచి పట్టుందని తెలిపారు. 
 
మంచి పేరున్న విద్యా సంస్థల్లోనే చదివాడని, పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు చేశాడని పేర్కొన్నారు. ఫిర్యాదులు అందడంతో నాలుగు నెలలుగా మహేశ్ కోసం వెతుకుతున్నామని, ఇప్పటికి దొరికాడని చెప్పారు.