గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (13:31 IST)

అత్యాచారం కేసులో ప్రముఖ సీరియల్ నటుడు అరెస్టు

ఓ అత్యాచారం కేసులో బుల్లితెర నటుడు పర్ల్ వీ పూరిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈయనతో మరో ఐదుగురు కలిసి ఓ బాలికను రేప్ చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై ముంబై మాల్వాని పోలీసులు కేసు నమోదు చేశారు. త‌న‌పై కారులో ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డార‌ని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ కేసులో పూరితో సహా మొత్తం ఆరుగురినీ పోలీసులు అరెస్ట్ చేసి ప్ర‌శ్నిస్తున్నారు. ప‌ర్ల్ పూరీని శుక్ర‌వారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. 2013లో "దిల్ కీ న‌జ‌ర్ సే ఖూబ్‌సూర‌త్" అనే సీరియ‌ల్‌తో టీవీ అరంగేట్రం చేశాడు ప‌ర్ల్ వీ పూరి. ఆ త‌ర్వాత "నాగిన్ 3"తో పాపుల‌ర్ అయ్యాడు. తాజాగా "బ్ర‌హ్మ‌రాక్ష‌స్ 2"లో న‌టించాడు.