సంబంధిత వార్తలు
- భారీ బందోబస్తు మధ్య ఆనందయ్య కరోనా మందు తయారీ
- ఆనందయ్య కరోనా మందు: ఆన్లైన్లో లేదూ ఆవకాయ బద్దా లేదు, కృష్ణపట్నంలో ఎగబడుతున్న జనం
- కృష్ణపట్నం పోర్టులో మందు తయారీకి ఆనందయ్య సన్నాహాలు, సొంత భవనానికి భూమిపూజ: ప్రెస్ రివ్యూ
- ఆనందయ్య మందును తితిదే పంపిణీ చేయదు: వైవీ సుబ్బారెడ్డి
- యాప్‌లో ఆనందయ్య మందు.. ఎవరూ కృష్ణపట్నం రావొద్దు.. కలెక్టర్
సోమవారం నుంచి ఆనందయ్య మందుకు పంపిణీ...
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నం గ్రామంలో సోమవారం నుంచి కరోనా నివారణ మందును బోనిగి ఆనందయ్య పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ మందు పంపిణీని శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ మేరకు ఆదివారం రాత్రి ఆనందయ్య ఓ వీడియో విడుదల చేశారు. మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని, నియోజకవర్గంలోని పాజిటివ్ బాధితుల ఇంటి వద్దకే మందు చేర్చుతామన్నారు. అక్కడ పూర్తయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తామన్నారు.
జిల్లాకు 500 ప్యాకెట్లు చొప్పున అధికార యంత్రాంగం సహకారంతో పంపిణీ చేస్తామన్నారు. అధికారుల వద్ద పేర్ల నమోదు చేసుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే మందు పంపిణీ జరుగుతుందని, సోమవారం జరిగే మందు పంపిణీలో అధికారుల పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని ఆనందయ్య వివరించారు.
మరోవైపు, కృష్ణపట్నంలో ఆనందయ్యకు చెందిన తోటలో ఆయన సోదరుడు నాగరాజు, మరి కొంతమంది కలసి గ్రామస్థులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కరోనా బాధితులకు ఆదివారం మందు పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటలో వందల మంది గుమిగూడారు.
సమాచారం అందుకున్న కృష్ణపట్నం ఎస్‌ఐ స్వప్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. కరోనా నివారణలో భాగంగా నిబంధనల మేరకు 144వ సెక్షన్ అమలులో ఉందని, ఈ పరిస్థితుల్లో ఇంతమందిని ఒకేచోట చేర్చడమేంటని నిర్వాహకులను ప్రశ్నించారు.
తక్షణం మందు పంపిణీ నిలిపివేయాలని కోరారు. మందు పంపిణీ చేస్తున్న నాగరాజును, కొంతమందిని అదుపులోకి తీసుకుని, గుమిగూడిన ప్రజలను అక్కడనుంచి పంపేశారు.
