శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 జూన్ 2021 (19:03 IST)

ఆనందయ్య మందును తితిదే పంపిణీ చేయదు: వైవీ సుబ్బారెడ్డి

ఆనందయ్య నాటు మందును తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేయదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''కేంద్ర ఆయుష్ శాఖ ఇచ్చిన రిపోర్టులో ఆనందయ్య మందు ఆయుర్వేద మందు కాదు అని చెప్పింది.

పైగా ఈ మందుతో కోవిడ్ తగ్గుతుంది అని ఎక్కడా చెప్పలేదు. వాడద్దని కూడా చెప్పలేదు. ప్రజల ఇష్టానికి వదిలేశారు. ఆయుర్వేదం కాదు కనుక మందు తయారీ పంపిణీ నిర్ణయం టీటీడీ ఆయుర్వేద కాలేజి విరమించుకుంది.
 
టీటీడీ ఆధ్వర్యంలో పంపిణీ చెయ్యాలని మొదట్లో భావించాం. ప్రస్తుతానికి పంపిణీ ఆలోచన లేదు. 
భవిష్యత్తులో రిపోర్టులు మెరుగ్గా వస్తే అప్పుడు పరిశీలిస్తాం.'' అన్నారు.