సంబంధిత వార్తలు
- హైకోర్టుకు చేరిన ఏపీ ఉద్యోగుల పీఆర్సీ పంచాయతీ
- ఏపీలో జిల్లాకో విమానాశ్రయం : "వన్ డిస్ట్రిక్ట్ - వన్ ఎయిర్పోర్ట్"పై సీఎం జగన్ రివ్యూ
- చదువుకున్న మూర్ఖుడు ఏపీ చీఫ్ సెక్రెటరీ: సీపీఐ నేత నారాయణ
- దీన దయాళ్ అంత్యోదయ యోజనతో ఉపాధి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
- ఐ.ఆర్. పై వక్రీకరణలు వద్దు... సీఎం జగన్ ఎపుడో ప్రకటించారు!
విశాఖ - న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్లో పొగలు...
విశాఖపట్టణం నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ (ఏపీ ఎక్స్‌ప్రెస్) రైలులో ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున సంభవించింది. దీంతో రైలును వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఎస్-6 బోగీ నుంచి ఈ పొగలు వచ్చినట్టు గుర్తించారు.
అయితే, రైలు బ్రేకులు జామ్ కావడం వల్లే పొగలు వచ్చాయని రైల్వే సిబ్బంది చెబుతున్నారు. లోపాన్ని సరిచేస్తున్నామని, ఈ లోపాన్ని సరిచేసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. కాగా, ఈ రైల్వే స్టేషన్‌లో రెండు గంటలకు పైగా ఏపీ ఎక్స్‌ప్రెస్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
