ఐ.ఆర్. పై వక్రీకరణలు వద్దు... సీఎం జగన్ ఎపుడో ప్రకటించారు!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐ.ఆర్. పై వక్రీకరణలు వద్దని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నెల లోపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐ.ఆర్. ప్రకటించారని అన్నారు. ఐ.ఆర్. కింద ఇప్పటికే 17వేల 918 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. కొత్త పి.ఆర్.సి. వల్ల జీతాల్లో కోత పడుతుంది అనేది అవాస్తవం అని పేర్కొన్నారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాం అని చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రొత్త పి.ఆర్.సి. అమలు చేస్తున్నామని వివరించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి దళారీ బాధ లేకుండా పూర్తి జీతం ఇస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్ కు చిత్తశుద్ది ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగులు అర్దం చేసుకోవాలి అని కోరారు. ఉద్యోగుల ఆవేశంతో గాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి అని మంత్రి పేర్ని నాని సూచించారు.