బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (23:30 IST)

వెన్న, ద్రాక్ష పండ్లతో హనుమంతుడిని పూజిస్తే...?

ఆంజనేయుడిని పూజిస్తే శివుడిని, విష్ణువును కలిసి పూజించిన పుణ్యం లభిస్తుంది. రామాయణంలో హనుమంతుడు ప్రధాన పాత్ర. గురు, శనివారాలు హనుమంతునికి ముఖ్యమైన పూజాదినములు. వెన్నతో హనుమంతుడిని పూజిస్తే వెన్న కరిగిపోయినట్లే కష్టాలు తొలగిపోతాయి. 
 
తమలపాకులను హనుమంతునికి శనివారం సాయంత్రం పూట సమర్పిస్తే శత్రు భయం తొలగిపోతుంది. అలాగే ద్రాక్షపండ్లు హనుమంతునికి ఇష్టమైన నైవేద్యం. అనుకున్న కార్యాల్లో విజయాన్ని పొందాలంటే ద్రాక్షపళ్లను నైవేద్యంగా వుంచి హనుమంతుడిని పూజించాలి. 
 
ఇంకా సింధూరంతో హనుమంతుడిని అలంకరించి.. శ్రీరామజయంతో స్తుతించాలి. వడ మాల, కాగితపు మాల  సమర్పించి కూడా హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు.
 
హనుమంతునికి తులసిని శనివారం సాయంత్రం అర్పించి పూజిస్తే శనీశ్వరుని ప్రభావం నుండి విముక్తి పొందవచ్చు. హనుమంతుని ఆరాధన వలన జ్ఞానం, బలం, కీర్తి, నిర్భయత, ఆరోగ్యం లభిస్తాయి.
 
వివాహం కోసం ప్రార్థించే వారు గురువారం సాయంత్రం హనుమంతుడిని పూజించాలి. గురు, శనివారాల్లో నిమ్మకాయను, వడమాలతో హనుమంతుడిని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.