1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Student Dies After Drowning in Brahmaputra River

బ్రహ్మపుత్ర నదిలో మునిగిపోయిన ఏపీ ఇంజనీరింగ్ విద్యార్థిని

Andhra Student
Andhra Student
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని బ్రహ్మపుత్ర నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుమార్తె సాయి చేతన రెడ్డిగా గుర్తించారు. ఆమె ఐఐటీ గౌహతిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో మూడవ సంవత్సరం బీటెక్ చదువుతోంది. 
 
ఈ నేపథ్యంలో సాయి చేతన తన స్నేహితుల బృందంతో కలిసి శనివారం బ్రహ్మపుత్ర నదీ తీరానికి వెళ్లారు. ఆమె, మరో విద్యార్థిని నదికి దగ్గరగా వెళ్లినప్పుడు కాలు జారి, నదిలోని ప్రవాహానికి కొట్టుకుపోయారు. స్థానికులు ఆ విద్యార్థులలో ఒకరిని కాపాడగలిగారు. కానీ సాయి చేతన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అనంతరం సహాయక బృందాలు ఆమె మృతదేహాన్ని వెలికితీశాయి. లథియా బగిచా ఘాట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఐఐటీ గౌహతి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. "శనివారం నాడు లథియా బగిచా ఘాట్ సమీపంలో నీట మునిగి మరణించిన ఈసీఈ విభాగం బీటెక్ మూడవ సంవత్సరం విద్యార్థిని అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. మరణించిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు మరియు ఆప్తులకు ఐఐటీ గౌహతి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
తెలంగాణలో సోమవారం భారీ వర్షాలు.. హైదరాబాదులో 16 శాతం తక్కువ వర్షపాతం