1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ap cm chandrababu naidu talk about world tele communication system

భవిష్యత్‌‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ : సీఎం చంద్రబాబు

chandrababu
దేశాల భవిష్యత్‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్‌ కీలకంకానుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏప్రిల్ 14న 'క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్' ప్రారంభోత్సవం తర్వాత.. ప్రపంచస్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు. 
 
దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో క్వాంటం వ్యాలీ ఆవిష్కరణలు, పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. భారత ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన సీడాట్‌, అమరావతి క్వాంటం వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలో తొలి క్వాంటం-సెక్యూర్‌ కమ్యూనికేషన్స్‌ టెస్ట్‌ బెడ్‌ ఏర్పాటు కానుందని చెప్పారు. 
 
ఇది పరిశోధనలకు, పరీక్షలకు తోడ్పడుతుందన్నారు. ఈ చొరవ డిజిటల్‌ సౌకర్యాలకు మనమిచ్చే నిబద్ధతను బలోపేతం చేస్తుందని, అమరావతిని డీప్‌-టెక్‌ ఆవిష్కరణల హబ్‌గా నిలుపుతుందని తెలిపారు. ఏపీ విద్యార్థులు భాగస్వాములు కావడానికి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.  
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వైకాపా మాజీ మంత్రి రజనీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - పాస్‌పోర్టు అప్పగింత