గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (16:48 IST)

వృద్ధురాలిపై బాలుడి లైంగికదాడి.. మంచంపై కదలలేని స్థితిలో

ఓ వృద్ధురాలిపై బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై ఆమె మనుమరాలైన బాలికను లైంగికదాడికి చేసేందుకు యత్నించిన ఘటన పలమనేరులో జరిగింది. పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో 80 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఆమె సమీప బంధువులు ఇక్కడే మరోచోట కాపురం ఉంటున్నారు.
 
అదే కాలనీలో జులాయిగా తిరిగే 16 ఏళ్ల బాలుడు శనివారం మధ్యాహ్నం వృద్ధురాలు మంచంపై కదలలేని స్థితిలో ఉండగా గమనించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గంట తరువాత వృద్ధురాలి మనుమరాలైన ఆరేళ్ల బాలిక అవ్వ కోసం భోజనం తీసుకుని అక్కడికి వచ్చింది.
 
బాలికపై కూడా లైంగికదాడి చేసేందుకు యత్నించాడు. అమ్మాయి కేకలు పెట్టడంతో పారిపోయాడు. పొరుగూరిలో పనులు చూసుకుని ఆదివారం ఇంటికి వచ్చిన తండ్రికి బాలిక సంఘటన గురించి తెలిపింది. సమీప బంధువైన వృద్ధురాలు కూడా దీనిపై వాపోయింది. 
 
బాలిక తండ్రి పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వృద్ధురాలు, బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు పేర్కొన్నారు.