బుధవారం, 11 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

జగన్.. రాయలసీమ బిడ్డకాదు.. అభివృద్ధిని అడ్డుకునే కేన్సర్ గడ్డ : టీడీపీ నేత బీటెక్ రవి

btechravi
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ కాదని అభివృద్ధిని అడ్డుకునే కేన్సర్ గడ్డ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తామే ఒత్తిడి తెచ్చి అపామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడాన్ని పట్టుకుని వైకాపా నేతలు ఇపుడు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జగన్ ప్రాధాన్యతలు రాష్ట్ర అభివృద్ధికి కాకుండా వ్యక్తిగత సౌకర్యాలతే పరిమితమయ్యాయని రవి విమర్శించారు. విశాఖలో తన కోసం నిర్మించుకున్న రిషికొండ ప్యాలెస్‌పై చూపిన శ్రద్ధలో 50 శాతం భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై పెట్టివుంటే అది ఎపుడో పూర్తయ్యేది అన్నారు. ఇపుడు నిర్మాణం పూర్తయితే ఆ క్రెడిట్ తానే తీసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. 
 
కేవలం రాజకీయ కక్షతో అమరావతిని నాశనం చేసి రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టారన్నారు. రాబోయే 20 యేళ్ల మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టి అప్పులు తెచ్చి రాష్ట్రం పరువు తీశారని మండిడ్డారు. టీడీపీ సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చి తీురతామని బీటెక్ రవి స్పష్టం చేశారు.