సంబంధిత వార్తలు
- దేశంలో కరోనా కేసులు పైపైకి... కొత్తగా మరో 45 వేల పాజిటివ్ కేసులు
- కరోనా చచ్చిపోయిందా- పారిపోయిందా? రోజా గారు మాస్కులు వేసుకోలేదే? స్కూలు పిల్లలు కూడా?
- కరోనా ఫ్రీ నగరంగా విజయవాడ!
- పండుగ సీజన్లలో జాగ్రత్త.. కరోనా మార్గదర్శకాలు పొడిగింపు.. కేంద్రం
- 75 నుండి 85 శాతం వరకు విద్యార్థులు పాఠశాలకు: విద్యాశాఖ మంత్రి
దివిసీమలో ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులకు కరోనా
కృష్ణాజిల్లా దివిసీమలో ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ ఏడాది దివిసీమలో విద్యార్థుల చదువుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. స్కూల్స్ తెరిచారనే ఆనందం ఒకవైపు, కరోణ దరికి చేరుతుందనే భయం మరోవైపు విద్యార్థులను వెంటాడుతున్నాయి.
పాఠశాల తెరిచి 15 రోజులు గడవక ముందే ఐదుగురు విద్యార్థులు కరోనా బారిన పడటం దివిసీమలో విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తుంది.
నాలుగు రోజుల క్రితం నాగాయలంక మండలం భావదేవరపల్లి ఎంపీపీ స్కూల్ లో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకగా ఇది జరిగి రెండు రోజులు గడవక ముందే కోడూరు మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఒక విద్యార్థికి మోపిదేవి మండల పరిధిలోని మెరకన పల్లి ఎంపీపీ స్కూల్ లో మరో విద్యార్థి కరోనా బారిన పడ్డారు.
అంతేకాకుండా చిన్నారులకు ఇంకా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాకపోవడంతో దివిసీమలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపాలా వద్దా అనే మీ మాంసలో ఉన్నారు. మరో నెలలో కరోణ మూడవ దశ వస్తుందనే వైద్యనిపుణుల ముందస్తు ప్రకటన సైతం విద్యార్థుల చదువులు పై ప్రభావం చూపుతుంది.
