మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (13:52 IST)

75 నుండి 85 శాతం వరకు విద్యార్థులు పాఠశాలకు: విద్యాశాఖ మంత్రి

రాష్ట్రంలోని పాఠశాలలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  తీసుకోనున్న జాగ్రత్తలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. మార్కాపురం లోని ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.

పాఠశాలలు ఓపెన్ చేసి ఇప్పటికీ పది రోజులైందనీ పాఠశాలలో హాజరు శాతం గణనీయంగా పెరిగిందని సుమారు 75 నుండి 85 శాతం వరకు విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారని అన్నారు.
 
పాఠశాలలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం మాస్కు తప్పనిసరిగా చేసామని చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయులకు 95 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు.
 
నాడు -నేడు పనుల ద్వారా పాఠశాలలు పరిశుభ్రంగా ఉన్నాయని శానిటేషన్ ప్రతిరోజు  చెపిస్తున్నామని రాష్ట్రంలో అక్కడక్కడా కరోనా కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తమని మంత్రి తెలిపారు. కరోనా అధికంగా ఉన్న పాఠశాల లలో విడతల వారీగా స్కూలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
 
సీఎం జగన్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు జగనన్న విద్యా కానుక జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి అన్నారు