సంబంధిత వార్తలు
- వామ్మో... తాప్సీ నిన్నలా చూడలేక చస్తున్నాం... నీ రోగం కుదర్చడానికే అలా పెట్టా, తాప్సీ
- బన్నీ వాసుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఏబీఎన్ ఆర్కే... చిరును తొక్కేస్తుందెవరు?
- నంది అవార్డుల రచ్చ... నారా లోకేష్ కొత్త మాట... NRAలట...
- పవన్ ఇంట్లో నేను బంట్రోతునే... సాయిధరమ్ తేజ్
- భజన చేసి అవార్డులు తీసుకుంటున్నారు: హీరో శివాజీ
జగన్ సిఎం కాడని చెబితే చంపేస్తారా.. చంపేయండి.. డేవిడ్ కరుణాకర్
విగ్రహారాధన చేసే వ్యక్తి శిక్షార్హుడని, ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని బైబిల్‌లో స్పష్టంగా ఉంది. అదే విషయాన్ని జగన్ విషయంలోను చెప్పాను. ఉన్నది ఉన్నట్లుగా చెబితే చంపేస్తారా. చంపేయండి.. దేవుని కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తిరుపతికి చె
విగ్రహారాధన చేసే వ్యక్తి శిక్షార్హుడని, ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని బైబిల్‌లో స్పష్టంగా ఉంది. అదే విషయాన్ని జగన్ విషయంలోను చెప్పాను. ఉన్నది ఉన్నట్లుగా చెబితే చంపేస్తారా. చంపేయండి.. దేవుని కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తిరుపతికి చెందిన ఫాస్టర్ డేవిడ్ కరుణాకరన్ అన్నారు.
దేవుడి బిడ్డగా ఉన్న వ్యక్తి తన కార్యక్రమాలు విజయవంతం కోసం తిరుమలకు వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం తప్పన్నారు డేవిడ్ కరుణాకర్. ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాను. నాకు జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత కక్షలేమీ లేవు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే మాకు ఎంతో ఇష్టం.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు మా కుటుంబ సభ్యులం ఎంతగానో బాధపడ్డాం. ఏడ్చాం. విగ్రహారాధన చేయడం వల్ల వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోతాడని తాను చెప్పలేదని, విగ్రహారాధన చేయకుండా ఉంటే మంచిదన్న విషయం మాత్రమే చెప్పానన్నారు ఫాస్టర్ డేవిడ్ కరుణాకర్.
