మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 20 నవంబరు 2017 (16:13 IST)

నంది అవార్డుల రచ్చ... నారా లోకేష్ కొత్త మాట... NRAలట...

నంది అవార్డుల గొడవ ఏపీ మంత్రి నారా లోకేష్‌ను కూడా మాట్లాడించేసింది. అమరావతి రాజధానిలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. నంది అవార్డులపై వస్తున్న విమర్శలపై ప్రశ్నించగా... ఎవరండీ మాట్లాడుతున్నదీ...? అ

నంది అవార్డుల గొడవ ఏపీ మంత్రి నారా లోకేష్‌ను కూడా మాట్లాడించేసింది. అమరావతి రాజధానిలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. నంది అవార్డులపై వస్తున్న విమర్శలపై ప్రశ్నించగా... ఎవరండీ మాట్లాడుతున్నదీ...? అంతా NRAలే. వాళ్లంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లు. 
 
ఇక్కడ ఆధార్ కార్డు కానీ ఓటరు కార్డు కానీ లేనివారు ఈ అవార్డుల గురించి మాట్లాడుతున్నారు. ఉదయాన్నే హైదరాబాదులో విమానం ఎక్కేసి విజయవాడలో దిగి ఇక్కడ ధర్నాలు చేసేసి మళ్లీ సాయంత్రానికి హైదరాబాద్ వెళ్లేవారు అవార్డులు గురించి మాట్లాడితే ఎట్లా అంటూ ప్రశ్నించారు. మొత్తమ్మీద NRI తర్వాత కొత్తగా NRA అనే కొత్త పదం కూడా చర్చలోకి వచ్చేసింది.