సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 20 నవంబరు 2017 (13:23 IST)

పవన్ ఇంట్లో నేను బంట్రోతునే... సాయిధరమ్ తేజ్

నాకు ముగ్గురు మామయ్యలు. అందులో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. నటనంటే ఆయన్ను చూసే నేర్చుకున్నాను. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే అంతా పవన్ కళ్యాణ్‌ దయే. నేను పవన్ కళ్యాణ్‌ ఇంటి ముందు ఒక జవాన్‌ను ఒక బంట్రోతుని. ఇదంతా చెప్పింది

నాకు ముగ్గురు మామయ్యలు. అందులో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. నటనంటే ఆయన్ను చూసే నేర్చుకున్నాను. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే అంతా పవన్ కళ్యాణ్‌ దయే. నేను పవన్ కళ్యాణ్‌ ఇంటి ముందు ఒక జవాన్‌ను ఒక బంట్రోతుని. ఇదంతా చెప్పింది ఎవరో కాదు సాయిధరమ్ తేజ్. జవాన్ సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సాయి ధరమ్ తేజ్ ఒక కార్యక్రమంలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు. 
 
నాకు పవన్ అంటే చెప్పలేనంత ఇష్టం. ముందు నుంచి నన్ను పవన్ ఎంతో అభిమానంతో చూసేవారు. నా సినిమాలు చూసి చాలా బాగుంటాయని చెప్పేవారు. నాకు అవార్డు కన్నా ఆయన ఇచ్చే ప్రశంసే నాకు ఆనందం అన్నారు సాయి ధరమ్ తేజ్. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్పినట్లు సాయి ధరమ్ తేజ్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.