శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2017 (12:54 IST)

పవన్‌తో చేసే ఛాన్స్ వస్తే మిస్ చేసుకోను : రకుల్

హీరో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే మిస్ చేసుకోబనని, ఖచ్చితంగా ఆయనతో కలిసి నటిస్తానని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెపుతోంది.

హీరో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే మిస్ చేసుకోబనని, ఖచ్చితంగా ఆయనతో కలిసి నటిస్తానని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెపుతోంది. అలాగే, అంతేకాదు అర్జున్ రెడ్డి ఫేమ్ విజరు దేవరకొండతోనూ నటించాలనుందని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే, అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ తరహాలాంటి పాత్రలో నటించాలన్న కోర్కెను ఆమె వెల్లడించారు. 
 
తాజాగా, సోషల్‌ మీడియాలో అభిమానులతో కాసేపు చాటింగ్‌ చేసిన రకుల్‌.. పవన్‌తో ఎప్పుడు నటిస్తారని ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, 'నాకు టాలీవుడ్‌లో పవన్‌ కళ్యాణ్‌తో నటించడమంటే ఇష్టం. అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. మీరే(అభిమానులు) డైరెక్ట్‌గా పవన్‌ని అడగండి. సినిమా చేయమని. ఆయన ఓకే అంటే నేను రెడీగా ఉన్నా. అలాగే నాకు విజరు దేవరకొండతో కూడా చేయాలనుంది' అని తెలిపింది. రకుల్‌ ప్రస్తుతం 'అయారి' అనే హిందీ చిత్రంలో నటిస్తుంది.