శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 16 నవంబరు 2017 (16:54 IST)

నాన్సెన్స్... వెళ్తారా లేదా? నిర్మాతను కసురుకున్న రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడామె టాలీవుడ్ సూపర్ హీరోయిన్. ఆమె కాల్షీట్ల కోసం చాలామంది దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు ఎదురుచూస్తున్నారు. సహజంగా కిందిస్థాయి నుంచి వచ్చిన నటీనటులు ఓ స్థాయికి వెళ్లిపోయాక తనకు ప్రారంభంలో ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు లేదా నిర్మాతకు మళ

రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడామె టాలీవుడ్ సూపర్ హీరోయిన్. ఆమె కాల్షీట్ల కోసం చాలామంది దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు ఎదురుచూస్తున్నారు. సహజంగా కిందిస్థాయి నుంచి వచ్చిన నటీనటులు ఓ స్థాయికి వెళ్లిపోయాక తనకు ప్రారంభంలో ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు లేదా నిర్మాతకు మళ్లీ తమ కాల్షీట్ ఇవ్వడం చాలా అరుదుగా వుంటుంది. దీనికి కారణం, ప్రారంభంలో సదరు హీరోహీరోయిన్లు చిన్న నిర్మాత, దర్శకుడి ద్వారా పరిచయమవుతారు. ఆ తర్వాత లక్ వుంటే పెద్ద స్టార్ అయిపోతారు. 
 
ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి కూడా అలాగే మారిందట. తన కెరీర్ తొలినాళ్లలో ఛాన్స్ ఇచ్చిన ఓ చిన్న నిర్మాత తనకు డేట్స్ కావాలంటూ రకుల్ ప్రీత్ సింగ్‌ను పదేపదే అడుగుతున్నారట. ఐతే... మంచి కథతో రండి, ఆలోచిద్దాం అని రకుల్ అనేసరికి, మరుసటి రోజే ఓ కథను తీసుకుని సదరు నిర్మాత ప్రత్యక్షమయ్యారట. ఐతే ఆ కథ రకుల్ ప్రీత్‌కు నచ్చలేదట. దానితో తను ఇలాంటి క్యారెక్టర్లో నటించనని తేల్చి చెప్పిందట. 
 
అయినప్పటికీ ఆ నిర్మాత మాత్రం రకుల్‌ను వదలకుండా కాల్షీట్లు కావాలని రోజూ వేధిస్తున్నాడట. దీంతో చిర్రెత్తిపోయిన రకుల్ ప్రీత్ సింగ్... నాన్సెన్స్... ఏంటి, ఇన్నిసార్లు చెప్పినా మీకు అర్థంకాలేదా... ప్లీజ్, నా కాల్షీట్లు ఖాళీలేవు. మీరిలాగే వేధిస్తే కంప్లైంట్ చేయాల్సి వస్తుందంటూ ఘాటుగా హెచ్చరించిందట.