ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 17 నవంబరు 2017 (13:23 IST)

పవన్ నాకు తమ్ముడు కాదు కొడుకు... చిరంజీవి

అవును. వాడికి తిక్కుంది. కానీ తిక్కకు లెక్క మాత్రం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసిపోయి కూర్చొని మాట్లాడటం, సమయం దొరికినప్పుడు ఎంజాయ్ చేయడం ఇలాంటివి పవన్ కళ్యాణ్‌‌కు తెలియదు. ఖాళీ సమయాలు దొరికితే పుస్తకాలు చదవడం, సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన ఉండటం పవన్

అవును. వాడికి తిక్కుంది. కానీ తిక్కకు లెక్క మాత్రం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసిపోయి కూర్చొని మాట్లాడటం, సమయం దొరికినప్పుడు ఎంజాయ్ చేయడం ఇలాంటివి పవన్ కళ్యాణ్‌‌కు తెలియదు. ఖాళీ సమయాలు దొరికితే పుస్తకాలు చదవడం, సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన ఉండటం పవన్ కళ్యాణ్‌‌కు మాత్రమే తెలుసు. అందుకే చాలామంది పవన్‌కు తిక్క అంటారు. నేను అదే చెబుతున్నా.. తను అనుకున్నది చేస్తాడు కాబట్టే దాన్ని నేను కూడా తిక్క అంటాను. ఆ చేసే పనిలో కూడా ఒక నిబద్ధత, నిజాయితీ, కసి పవన్ కళ్యాణ్‌‌లో ఉంటుంది. అందుకే వాడంటే నాకు చాలా ఇష్టం.
 
ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటాడు.. అనవసరమైన మాటలు అస్సలు మాట్లాడడు. నాకు నా కొడుకు చరణ్ ఎలాగో పవన్ కళ్యాణ్‌ కూడా అలాగే. నేను సినిమాల్లోకి ఎంటర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్‌ 5వ తరగతి చదువుతున్నాడు. మొదటిసారి ఫారెన్ ట్రిప్‌కు షూటింగ్‌కు వెళ్ళా. అప్పుడు పవన్‌కు బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చా. చాలా సంతోష పడ్డాడు. 
 
ఇప్పటికీ ఆ బొమ్మలను పవన్ ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకుని ఉన్నాడు. ఇది చాలు. అన్న మీద పవన్‌కు ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి. పవన్ తన సొంత కొడుకికి కూడా నేను తీసిచ్చిన బొమ్మలు ఇవ్వలేదు. అన్నాదమ్ముల మధ్య ప్రేమ ఎలాంటిదో ఈ ఒక్క ఉదాహరణ చాలు అని పవన్ పైన తనకున్న ప్రేమను ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి అలా చెప్పారు.