1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Does not work with biometric in AP .. Irish policy in force

ఏపీలో బయోమెట్రిక్ తో పని లేదు.. అమల్లోకి ఐరిష్ విధానం

biometric
రాష్ట్రములోని సచివాలయ ఉద్యోగులు ఎవరూ బయోమెట్రిక్ వల్ల ఇబ్బందులు పడాల్సిన పని లేదని, ఇప్పటికే అన్ని చోట్ల ఐరిష్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని ఏపీ గ్రామ వార్డు సచివాలయాల మీడియా విభాగం సంయుక్త సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.

బయోమెట్రిక్ అమల్లో కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆ శాఖ మీడియా విభాగం సంయుక్త సంచాలకులు స్పందించారు. సాంకేతికంగా ఎక్కడ  ఏ ఇబ్బంది ఎదురైనా వెంటనే చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. 

కోవిద్ నేపథ్యంలో వేలిముద్రల ద్వారా హాజరును తీసుకోవడం సురక్షితం కాదని ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు తీసుకొని ఐరిష్ విధానాన్ని అమలు చేసిందని చెప్పారు. యాప్ లో హాజరును నమోదు చేయడంలో ఏ ఇబ్బందులు ఉన్నా వెంటనే కమిషన్ కార్యాలయంలోని ప్రత్యేక విభాగానికి ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తారని చెప్పారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రతిపక్షానికి ఆనందమెందుకు?: మంత్రి కన్నబాబు