జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం జగన్ నేతృత్వంలో జరిగిన మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అంతేగాక పలు కీలక నిర్ణయాలూ తీసుకుంది. ఆ వివరాలు...
1,సమాజంలో చెడు ధోరణిలకు కారణమవుతున్న ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులపై నిషేధం విధిస్తూ... ఏపీ గేమింగ్ యాక్ట్–1974 సవరణలకు కేబినెట్ ఆమోదం. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్లకు 6 నెలలు శిక్ష, నిర్వాహకులుకు ఏడాది జైలు శిక్ష, రెండోసారి తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష.
2, ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి కేబినెట్ ఆమోదం
3,పంచాయితీరాజ్ శాఖలో మెరుగైన పాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధలో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ పోస్టులు ఏర్పాటుకు నిర్ణయం. జాయింట్ కలెక్టర్లుకు కింద ఎంపీడీఓలకు పైన ఏర్పాటు కానున్న పోస్టులు. డిప్యూటీ డైరెక్టర్ కేడర్‌లో ఏర్పాటు కానున్న డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ పోస్టులు
మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్‌కు పదోన్నతులు కల్పించడం ద్వారా డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీ
4,ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎస్‌డీసీ) ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 80 ను ఆమోదించిన కేబినెట్. ఏపీఎస్‌డీసీ నూరు శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాగా... ప్లానింగ్, ఫండింగ్‌తో పాటు సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు ప్రణాళిక, ఫండింగ్ చేయనున్న కార్పొరేషన్.
5, కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన మరో రెండు కొత్త బ్యారేజీలు నిర్మాణప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన మంత్రిమండలి. రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రూ.2565 కోట్లతో ప్రతిపాదన.
ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం నడుమ బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదలకు ఆమోదం తెలిపిన కేబినెట్. రూ.1215 కోట్లతో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదన.
ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన హంసలదీవికి పైన కృష్ణ జిల్లా మోపిదేవి మండలం బండికోళ్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూరుపుపాలెం నడుమ మరో బ్యారేజీ నిర్మాణప్రతిపాదనలకు కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం
రూ.1350 కోట్లతో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదన.
వరికపూడిశెల ఎత్తిపోతల పథకం సమగ్ర సర్వే, డీటైల్డ్ ప్రొజెక్ట్ రిపోర్ట్‌కు కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం. ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరు జిల్లా వెల్ధుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాలకు అందనున్న సాగునీరు. రూ.1273 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన
బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్–2 నిర్మాణ ప్రతిపాదలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన మంత్రిమండలి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాల ఆయుకట్టు స్ధిరీకరణసాగు అవసరాల కోసం ఎత్తిపోతల ద్వారా అందుబాటులోకి రానున్న 63.2 టీఎంసీల నీరు. రూ.15389.80 కోట్ల అంచనాలతో చేపట్టనున్న నిర్మాణ పనులు
6, రాయలసీమ ప్రాంతంలో 14 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం మరియు ఇతర పనులకు సంబంధించిన పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం.
7, గుంటూరు జిల్లా బాపట్ల మండలం మూలపాలెం, జమ్ములపాలెం గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
8, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
9, మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాల మీద మరో ఏడాదిపాటు నిషేధం పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం..
రాడికల్ యూత్ లీగ్ ( ఆర్‌వైఎల్)
రైతు కూలీ సంఘం(ఆర్‌సీఎస్) లేదా గ్రామీణ పేదల సంఘం(జీపీఎస్)
రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్‌ఎస్‌యూ)
సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస)
విప్లవ కార్మిక సమాఖ్య(వికాస)
ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్(ఏఐఆర్‌ఎస్‌ఎఫ్)
10,పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్–2020కు ఆమోదం తెలిపిన కేబినెట్. మత్స్యరంగంలో సమగ్రఅభివృద్ధి కోసం ఏర్పాటు కానున్న ఫిషరీస్ యూనివర్సిటీ. దీని ద్వారా రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యం. ఈ యూనివర్సిటీ కోసం రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్లు పెట్టుబడి లక్ష్యం. ఆక్వా రంగంలో నిపుణుల కొరత కారణంగా ఏడాదికి సుమారు రూ.2500 కోట్లు నష్టపోతున్నామని అంచనా. ఈ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా రూ.2500 కోట్ల ఆక్వా నష్టాన్ని నివారించవచ్చని అంచనా.
దీనివల్ల సుమారు 90 వేల మంది ఆక్వా రైతులు, దీనిపై ఆధారపడ్డ మరో ఎనిమిది లక్షల మంది జనాభా లబ్ధి పొందుతారని ఆంచనా.
11, రాష్ట్రంలో తాజా వ్యవసాయ పరిస్ధితులపై మంత్రివర్గంలో చర్చ.