లెబనాన్ లో మృత్యుహేల.. భారీ పేలుడుతో.. 80 మంది మృతి.. 4 వేలమందికి గాయాలు
భారీ పేలుడు లెబనాన్ ను వణికించింది. మృత్యువు వికటాట్టహాసం చేసింది. మంగళవారం సాయంత్రం లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించి సుమారు 80 మంది చనిపోగా.. నాలుగు వేలమందికి పైగా గాయపడ్డారు.
పోర్టు ఏరియాలో అమోనియం నైట్రేట్‌ను నిల్వ ఉంచిన గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు. వీధుల వెంట పరుగులు తీశారు. దాదాపు కిలోమీటర్‌కు పైగా ఈ భారీ పేలుడు వ్యాపించినట్టు తెలుస్తోంది.
మొదటి పేలుడు సంభవించిన కాసేపటికే రెండో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులో వుందని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.