శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:47 IST)

20 మందిపై ఆ పోర్న్ స్టార్ అత్యాచారం

సుమారు 2 వేల నీలి చిత్రాల్లో నటించిన 67 ఏళ్ల పోర్న్ స్టార్ 20 మందిని రేప్ చేశాడంటూ కేసులు నమోదవ్వడం 'నీలి ప్రపంచం'లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఆయనెవరో కాదు అమెరికాకు చెందిన పోర్న్ ‌స్టార్‌ రాన్ జెర్మీయే. ఆయనపై 20 అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదు చేసిన వారిలో 15 ఏళ్ల వయస్సు గల బాలికతో సహా 12 మంది మహిళలు ఉన్నారు.

జూన్‌లో వరుసగా బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే ఆయన 250 ఏళ్లు కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఆయనపై చాలా మంది మహిళలు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచిత్రమేమంటే.. ఫిర్యాదు చేసిన వారిలో ఆయనతో కలిసి నీలి చిత్రాల్లో నటించిన మహిళలూ వున్నట్లు సమాచారం.