శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:23 IST)

శ్రీశైలం ఆనకట్ట వద్ద విరిగిపడిన కొండచరియలు

శ్రీశైలం ఆనకట్ట సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆనకట్ట ప్రవేశద్వారం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. పైనుంచి పెద్ద బండరాళ్లు జారిపడ్డాయి.

రాత్రి వేళ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఉద్యోగులు, పర్యాటకులు రాకపోకలు సాగించే చోట ఈ విధంగా బండరాళ్లు పడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొండచరియలు విరిగిపడే చోట కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.