1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:15 IST)

ఇలా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు

కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో కీలకమైనది మాస్కు ధరించడం. మాస్కును ధరించడం ద్వారా తుమ్మడం, దగ్గడం చేసినపుడు తుంపర్లు బయట పడకుండా చూడడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.

అందుకే మాస్కు ధరించడం తప్పనిసరి చేసిన ఏపీ ప్రభుత్వం 'మాస్కే కవచం' పేరుతో ప్రజల్లో అవగాన పెంచేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 
   
- కిరాణా షాపులు, మెడికల్ షాపులు, షాపింగ్ మాల్స్ లాంటి రద్దీ ప్రదేశాల్లో మాస్కును తప్పనిసరిగా ధరించాలి. అంతేకాకుండా కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. 
- షాపు సిబ్బందితో మాట్లాడేటప్పుడు మాస్కు తీసివేయకుండా మాట్లాడాలి. 
- మాస్కు వేసుకుని తుమ్ముని, మాట్లాడిన వారికంటే మాస్కు లేకుండా తుమ్మడం, మాట్లాడం చేసేవారి వల్లే కోవిడ్ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోండి. 
- సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లినపుడు మాస్కును ముఖం, ముక్కు, నోరు కప్పివుంచేలా ధరించండి.