మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జులై 2020 (13:32 IST)

అత్యాచారానికి గురైన బాలికను దత్తత తీసుకున్న టీడీపీ

రాజమండ్రిలో దళిత మైనర్ బాలిక(16)పై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం బుధవారం రాజమండ్రి సందర్శించి బాధితురాలిని పరామర్శించిన అంశం విదితమే.

బాధితురాలి పరిస్థితి గురించి టీడీపీ ప్రతినిధుల బృందం వివరించగానే చంద్రబాబు చలించిపోయారు. వెంటనే బాధితురాలికి రూ2లక్షల ఆర్ధికసాయం అందించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. 

దళిత బాలిక పదో తరగతి దాకా చదువుకుందని పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు, ఆమెను పార్టీ తరఫున దత్తత చేసుకుని చదివించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

బాధితురాలిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని, టీడీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని చంద్రబాబు కోరారు. ఇటువంటి దుర్మార్గాలపై పోరాడే యోధురాలిలా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందన్నారు.