శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (08:26 IST)

ఏపీలో యాంటిజెన్ పరీక్షకు రూ. 750 మాత్రమే

కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల పై ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అధిక ధరలు తీసుకుంటే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు..

1. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ఆసుపత్రి కానీ ల్యాబ్లు కానీ రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జరపకూడదు.
2. ఇందుకు సంబంధించి విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేయడమైనది.
3. అయినప్పటికీ కొన్ని ఆసుపత్రులు మరియు పరీక్ష కేంద్రాలు ఎటువంటి అనుమతులు లేకుండా రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తూ అధిక ధరలను వసూలు చేస్తునట్టు ప్రభుత్వ దృష్టికి వస్తున్నాయి.
4. అటువంటి కొన్ని ఆసుపత్రులపైనా కూడా చర్యలు కూడా తీసుకోవటం జరిగింది.
5. రాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయతలచిన ఎన్ఏబీఎల్ పరీక్షా కేంద్రాలు మరియు ఎన్ఏబీహెచ్
 
ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వ కోవిడ్ -19 నోడల్ అధికారి (లాబ్స్) ని సంప్రదించి అనుమతి తీసుకొని పరీక్ష ఫలితాలను సదరు ఆన్ లైన్ పోర్టల్ లాగిన్ లో పొదుపరుచుట తప్పనిసరి.  అనుమతులు పొందదలచిన వారు సదరు ఎన్ఏబీహెచ్
 
మరియు ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్లను క్రింద తెలిపిన మెయిల్ ఐడికు పంపవలెను 

6. అనుమతి తీసుకున్న ఎన్ఏబీఎల్ పరీక్షా కేంద్రాలు మరియు ఎన్ఏబీహెచ్
 
ఆసుపత్రులు కూడా రాపిడ్ యాంటిజెన్ పరీక్షకు ప్రభుత్వ ఉత్తర్వులు No. 336 తెలిపిన ప్రకారం రూ. 750/- మాత్రమే వసూలు చేయవలెను.

7. అంతకు మించి వసూలు చేసినచొ ప్రభుత్వ ఉతర్వుల ఉల్లంఘనగా పరిగణించి ఆ ఆసుపత్రి లేదా పరీక్ష కేంద్రాల లైసెన్స్ ను రద్దు చేయటం జరుగుతుంది.