బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (10:06 IST)

విశాఖ మెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చికిత్స చేయించుకోండి: జ‌గ‌న్‌కు మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ సూచ‌న

కుల‌పిచ్చికి బ్రాండ్ అంబాసిడ‌ర్ జ‌గ‌న్‌రెడ్డి అని మాజీ మంత్రి కెఎస్ జ‌వ‌హ‌ర్ ఆరోపించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని రెడ్ల రాజ్యంగా మార్చింది జ‌గ‌న్‌రెడ్డేన‌న్నారు.

ఇదంతా కుల‌పిచ్చి బాగా ఎక్కువైపోయి సాయిరెడ్డికి క‌నిపించ‌డంలేద‌న్నారు. సీఎం నుంచి వార్డు మెంబ‌ర్ వ‌ర‌కూ రాష్ట్ర‌మంతా రెడ్ల‌మ‌యం అయిపోయింద‌ని ఆరోపించారు.

రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ కార్పొరేష‌న్ల‌కు రెడ్ల‌ను వేసుకోవ‌డానికి వీలులేక‌ వ‌దిలేశారు కానీ, మిగిలిన అన్ని నామినేటెడ్‌, ఉన్న‌త ప‌దవులు 800 మందికి పైగా రెడ్ల‌కే క‌ట్ట‌బెట్టడం కుల దుర‌భిమానానికి ప‌రాకాష్ట‌గా నిలిచింద‌న్నారు. 

యూనివ‌ర్సిటీలు వీసీ నుంచి సెక్యూరిటీ గార్డువ‌ర‌కూ రెడ్లే. జ‌గ‌న్‌రెడ్డి కులోన్మాదం ప‌తాక‌స్థాయికి చేరింద‌ని, రెడ్లంద‌రికీ అంద‌లాలెక్కిస్తూ..అణ‌గారిన వ‌ర్గాల‌ని తొక్కేస్తున్నార‌ని ఆరోపించారు.

రెడ్డి కుల మ‌దంతో ద‌ళితులపై ద‌మ‌న‌కాండ సాగిస్తున్నార‌ని, రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ ద‌ళితుల‌పై 60కి పైగా దాడులు జ‌రిగాయ‌ని కేసులు న‌మోద‌య్యాయ‌ని, ఇంకా న‌మోదు కాని రెడ్ల అరాచ‌కాలెన్నో వున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పార్టీ పేరు కూడా పూర్తిగా చెప్పుకోలేని సిగ్గుమాలిన పార్టీకి అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శి, గౌర‌వాధ్య‌క్షురాలి నుంచి పార్టీ బాధ్య‌త‌లు చూసే వారి వ‌ర‌కూ అంతా రెడ్లే వున్న పార్టీ దేశంలో యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఒక్క‌టేన‌న్నారు.

రాష్ట్రాన్ని ఐదు ముక్క‌లు చేసి ఐదుగురు రెడ్ల‌కు రాసిచ్చేశారంటే ఇది త‌న‌కు వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చిన రాజ్య‌మ‌నుకుంటున్న‌ట్టున్నార‌ని జ‌వ‌హ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

విశాఖ పిచ్చి ఆస్ప‌త్రిలో అన్ని పిచ్చిల‌కు వైద్యం చేసిన‌ట్టు జ‌గ‌న్‌రెడ్డికి బాగా ముదిరిపోయిన రెడ్డి కుల‌పిచ్చ‌కు వైద్యం చేయాల‌ని సూచించారు.  చికిత్స‌కూ రెడ్డి కుల‌పిచ్చ‌త‌గ్గ‌క‌పోతే  కులోన్మాద చేష్ట‌ల‌తో విసిగి వేసారిన ప్ర‌జ‌లే రాళ్లు పెట్టి కొట్టే రోజు ద‌గ్గ‌ర్లోనే వ‌స్తుంద‌ని జోస్యం చెప్పారు.

చంద్ర‌బాబునాయుడికి కుల‌పిచ్చి అని ఆరోపించిన విజ‌య‌సాయిరెడ్డికి ద‌మ్ముంటే..టిడిపి హ‌యాంలో జ‌రిగిన నియామ‌కాలు, జ‌గ‌న్‌రెడ్డి హ‌యాంలో రెడ్ల‌కు జ‌రిగిన ప‌ద‌వుల పందేరంపై బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన నియామకాల పై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా సాయిరెడ్డి అని జవహర్ ప్రశ్నించారు.