మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (08:31 IST)

తెలంగాణాకి ఏమైంది.. మరో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

ఇటీవలికాలంలో తెలంగాణా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కారులో వెళుతున్న ఐదుగురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా ప్రయాణిస్తున్న కారును ఇసుక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇపుడు మరో ప్రమాదం జరిగింది. ఇందులో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
హైదరాబాద్ నుంచి సాగర్‌వైపు వెళ్తున్న కారు నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.