శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (14:26 IST)

కరోనా సోకి 'ఎదురీత' చిత్ర నిర్మాత కన్నుమూత

కరోనా వైరస్ సోకి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ నిర్మాత కన్నుమూశారు. ఆయన పేరు బోగారి లక్ష్మీనారాయణ. ఈయన నిర్మాణ సంస్థ శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్. ఈ బ్యానర్‌పై గతంలో ఎదురీత అనే సూపర్ హిట్ మూవీని నిర్మించారు. 
 
అయితే, ఈయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో గత కొద్ది రోజులుగా ఆయ‌న య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించ‌డంతో క‌న్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ఇండ‌స్ట్రీపై ఎంత‌గా ఎఫెక్ట్ చూపించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కరోనా వ‌ల‌న గ‌త 5 నెల‌లుగా షూటింగ్స్ అన్నీ స్తంభించాయి. దీంతో సినీ కార్మికులు పొట్ట‌కూటి కోసం ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతున్న విషయం తెల్సిందే. అదేసమయంలో అనేక మంది ఈ కరోనా వైరస్ బారినపడి మృత్యువాపడుతున్నారు.