శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (22:55 IST)

పవర్ స్టార్ పవన్ బర్త్ డే ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్, ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా కుప్పంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్లెక్సీలను కడుతుండగా కరెంట్ షాక్‌కు గురై ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్లెక్సీ కడుతుండగా 13 మందికి కరెంట్ షాక్ తగిలిందని సమాచారం. ఈ దారుణ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
 
కాగా సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై కొందరు అభిమానులు ఈ ఫ్లెక్సీలు కడుతున్నారు. ఫ్లెక్సీ వెనుకభాగం అంతా ఇనుప తీగలు వుండటంతో అవి విద్యుత్ వైర్లకు తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
 
తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.