మన దేవుడి బ్లెస్సింగ్ కోసం వెయిటింగ్ : బండ్ల గణేశ్

bandla ganesh
ఠాగూర్| Last Updated: సోమవారం, 31 ఆగస్టు 2020 (15:19 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖ నిర్మాతల్లో బండ్ల గణేష్ ఒకరు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన సినీ సెలెబ్రిటీల్లో ఈయన మొదటివారు. ఆ తర్వాత ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.

అయితే, బండ్ల గణేష్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్', 'తీన్‌మార్' వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. మరోవైపు, జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం వపన్ కల్యాణ్ చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఈ క్రమంలో పవన్ మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. దీంతో, పవన్‌తో సినిమా ఎప్పుడు తీస్తున్నారంటూ బండ్ల గణేశ్‌ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై బండ్ల గణేశ్ స్పందిస్తూ, తాను కూడా అదే పనిలో ఉన్నానని, మన దేవుడి ఆశీస్సులు కావాలని చెప్పారు. పవన్‌ను బండ్ల గణేశ్ దేవుడిగా భావిస్తారనే విషయం తెలిసిందే.దీనిపై మరింత చదవండి :