శనివారం, 6 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 డిశెంబరు 2025 (14:46 IST)

వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తూ మంటల్లో కాలిపోయిన ఇన్‌స్పెక్టర్

si panchakshari burn alive
ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చిక్కుకుని మంటల్లో సజీవదహనమయ్యారు. ఈ విషాదక ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. శనివారం ధారవాద జిల్లా అన్నిగెరె వద్ద ఈ ఘటన జరిగింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదగ్‌ లోకాయుక్త ఎస్పీ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య శాలిమఠ్‌ (38) ధారవాదలో ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో పక్కన ఉన్న వంతెనను కారు ఢీకొట్టింది. 
 
దీంతో వాహనంలో మంటలు వ్యాపించి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాద ఘటన స్థానికంగా కీలక విషాయం నింపింది.