1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Driver Subrahmanyam Case: ycp mlc Anantha Babu Arrested

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు

car driver murder case
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి బయటకి రాగానే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడలోని సర్పవరం పీఎస్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో కోర్టు సముదాయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. 
 
గత నాలుగేళ్లుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ఈ కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడు ఏ1గాను ఉండగా, ఆయన భార్య లక్ష్మీదుర్గ ఏ2గా ఉన్నారు. ఇటీవల రాజమండ్రి ప్రత్యేక కోర్టులో అనంతబాబుకు గతంలో మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ నిమిత్తం ఆయన తన భార్యతో కలిసి కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చారు. 
 
అయితే, అనంతబాబు కోర్టు హాలులోకి వెళ్లకముందే పోలీసులు అరెస్టు చేశారు. అనంతబాబు అరెస్టు నేపథ్యంలో రాజమండ్రి కోర్టు ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ అరెస్టుతో కేసు విచారణ మరోమారు వేగవంతంకానుంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు : ఓటు కోసం పోటెత్తిన మహిళాలోకం