సంబంధిత వార్తలు
- 67% మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు
- కోవిడ్: విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న అత్యవసర సహాయం అవసరమైన వారికి చేరుతోందా?
- తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి... ఇవీ రేట్లు - ప్రెస్ రివ్యూ
- మొత్తం ఆక్సిజన్ కేటాయించలేం.. మీ వాటాను కేంద్రం నిర్ణయిస్తుంది...
- ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు : తితిదే
విదేశాలకు వెళ్తా, అనుమతివ్వండి: ఎంపీ విజయసాయి
తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సిబిఐని అభ్యర్థించారు. సిబిఐ కేసులో నిందితుడిగా, ఏ 2గా ఉన్న విజయ సాయి దేశం విడిచి వెళ్లరాదన్నఆంక్షలున్నాయి.
సిబిఐ ఆయన్ని అరెస్టు చేసిన తర్వాత, బెయిల్ పైన విడుదల చేసేటపుడు ఈ షరతును విధించింది. అయితే, తాను ఇపుడు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉందని, ఆ ఆంక్షలను సడలించాలని విజయసాయి కోరారు.
అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్తానని ఆయన పేర్కొన్నారు. విదేశాలకు వెళ్ళేందుకు రెండు వారాలు అనుమతివ్వాలని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. తదుపరి విచారణ ఈ నెల 16కి సిబీఐ కోర్టు వాయిదా వేసింది.
