1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Heavy flooding to Prakasam Barrage

ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరదనీరు

flooding
కృష్ణా నదిపై నిర్మితమైన ప్రకాశం ‌బ్యారేజ్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. బ్యారేజ్‌కి చెందిన 15 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి.. 14 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు.

మున్నేరు, వైరా, కట్లేరు, కీసర నుంచి భారీగా ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు చేరుకుంటోంది.సుమారు 30 వేల క్యూసెక్కుల నీరు చేరుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నది పరివాహ ప్రాంత పరిధిలోని ఎమ్మార్వోలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు పరివాహ ప్రాంత పరిధిలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తర్వాతి కథనం
ఏపీ రేషన్ సరుకులలో ఇక బియ్యం మాత్రమే