మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2019 (17:36 IST)

చంద్రబాబు నివాసానికి తప్పిన వరద ముప్పు

కృష్ణానది ఎగువ భాగంలో నదిని ఆనుకుని ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి ఎలాంటి ముంపు పరిస్థితి బుధవారం సాయంత్రం వరకు కనిపించలేదు. 
 
పైనుంచి వచ్చే వరద నీరు ఆయన నివాసం వద్ద నుంచి ప్రకాశం బ్యారేజీకి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు ప్రవేశిస్తుందనే ఉద్దేశంతో ఈ నెల 13వ తేదీ సాయంత్రానికే చంద్రబాబు నాయుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సామాగ్రిని పై అంతస్తులోకి మార్చారు. 
 
వరద పెరిగితే నివాసం వైపునకు రాకుండా ఉండేందుకు రక్షణ చర్యల్లో భాగంగా కంకరడస్ట్ నింపిన ఆరువేల బస్తాలతో మూడు లైన్లుగా అడ్డుకట్ట ఏర్పాటు చేశారు. 
 
6లక్షల క్యూసెక్కుల వరద వస్తే తప్ప భవనం వైపునకు నీరు ప్రవేశించే అవకాశం ఉండదని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.