సంబంధిత వార్తలు
- వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు
- రౌడీయిజం - దౌర్జన్యం చేయడానికే వైకాపా నేతల అమరావతి యాత్ర : హోం మంత్రి అనిత
- స్మార్ట్ కిచెన్‌ను వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కారణం ఏంటంటే?
- Balakrishna: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతుతో అమరావతిలో చిత్ర పరిశ్రమకు కట్టుబడి ఉన్నాం
- Nara Lokesh: మామ పై క్లాప్ కొట్టి NBK112 చిత్రం ప్రారంభించిన నారా లోకేష్
వైకాపా గానీ, జగన్ గానీ అమరావతి వ్యతిరేకం కాదు.. దేవినేని అవినాష్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతి రాజధాని పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ గానీ లేదా వైసీపీ ప్రభుత్వం గానీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకంగా లేదని వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్ వాదిస్తున్నారు. మచిలీపట్నం, గుంటూరుతో పాటు అమరావతిని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం జగన్‌కు ఎప్పుడూ ఉండేదని, ఆయన రాజధాని ప్రాంతానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఈ యువ నాయకుడు పేర్కొన్నారు.
మంగళవారం మళ్లీ అమరావతి పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. అమరావతి ప్రాంతంలో మళ్లీ వైసీపీ కమిటీ పర్యటిస్తుందని, రైతులకు పార్టీ అండగా ఉంటుందని అవినాష్ స్పష్టం చేశారు. తమను ఎంతమందితో అడ్డుకుంటారో చూస్తామన్నారు. వైసీపీ నాయకులపై దాడు చేసి, తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టడం జంగిల్ రాజ్ విధానమని అవినాష్ మండిపడ్డారు.
అమరావతి పట్ల జగన్‌కు ఎలాంటి వ్యతిరేక భావన లేదని బహిరంగంగా చెప్పడం చాలా సాహసోపేతమైన విషయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ, అవినాష్ చేసిన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి ప్రాంతం పట్ల జగన్ చూపిన బహిరంగ వ్యతిరేకతను నెటిజన్లు ఎండగడుతున్నారు.
